పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి

Telugu Lo Computer
0


పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి అమరీందర్ సింగ్ పోటీ చేశారు. అయితే ఆయన ఆప్‌ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్‌ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అమరీందర్‌ సింగ్‌ ఎక్కువ కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగి, ఆ తర్వాతే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి తాను మద్దతిస్తున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు. తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు అమరీందర్ తెలిపారు. ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. పంజాబీలు మతపరమైన అంశాలకు అతీతంగా ఓటు వేశారని, పంజాబీయత్ నిజమైన స్ఫూర్తిని ప్రదర్శించారని అమరీందర్ ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 'కెప్టెన్' పంజాబ్‌లో అధికార వ్యతిరేకతను ఎదుర్కొవడంతో ఓటమి పాలయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)