ఆసియా 50 బెస్ట్ రెస్టారెంట్ల లిస్టులో భారత్ నుంచి మూడింటికి చోటు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 30 March 2022

ఆసియా 50 బెస్ట్ రెస్టారెంట్ల లిస్టులో భారత్ నుంచి మూడింటికి చోటు


ఆసియాలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్ల లిస్టును విలియమ్ రీడ్ బిజినెస్ మీడియా లిమిటెడ్  విడుదల చేసింది. ఈ 50 రెస్టారెంట్లలో భారత్ నుంచి మూడింటికి చోటు లభించింది. ఈ లిస్టులో మొదటి స్థానాన్ని జపాన్ రాజధాని టోక్యోలోని 'డెన్ రెస్టారెంట్' దక్కించుకుంది. ఈ జాబితాలోని రెస్టారెంట్లను చెఫ్ లు, రెస్టారెంట్ యజమనాలు, విమర్శకులు, ఆహారంపై రచనలు చేసేవారు, ఆహార నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేస్తారు. భారతదేశం నుంచి ముంబైలోని 'మాస్క్' 21వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని 'ఇండియన్ యాక్సెంట్' 22వ స్థానంలో, ఢిల్లీలోని 'మెగు' రెస్టారెంట్ 49వ దక్కించుకున్నాయి. ముంబైలోని మాస్క్ రెస్టారెంట్ ను చెఫ్ ప్రతీక్ సాధు, డైరెక్టర్ అదితి దుగార్ స్థాపించారు. రుచికరమైన పదార్థాలకే ఇక్కడ చోటు ఉంటుంది. అలాగే, రుతువుల వారీగా, స్థానికంగా లభించే ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉంటుంది. 2020 జాబితాలోనూ మాస్క్ చోటు దక్కించుకోవడం గమనార్హం. 350 మంది విమర్శకులు, ఆహార రచయితలు, చెఫ్‌లు, రెస్టారెంట్‌లు మరియు ఆహార వ్యసనపరులు ఈ జాబితాను రూపొందించారు.

No comments:

Post a Comment