దేశంలో 2,568 కరోనా కొత్త కేసుల నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2 వేల 568 మందికి వైరస్‌ ఉందని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి కారణంగా 97 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క కేరళ నుంచే 78 మరణాలు నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతున్నామరణాల సంఖ్యలో మాత్రం తేడా కనిపిస్తోంది. ఇప్పటివరకు వైరస్‌ వల్ల 5.15 లక్షల మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వస్తుండటంతో బాధితుల సంఖ్య 33 వేల 917కి చేసింది. మొత్తం కేసుల్లో ఈ వాటా 0.08 శాతంగా ఉంది. తాజాగా కరోనా వైరస్ నుంచి 4 వేల 722 మంది కోలుకున్నారు. ఈరోజు వరకు 4.24 కోట్ల మంది వైరస్‌ ను జయించారు. రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది. మరోవైపు దేశ్యాప్తంగా టీకా ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పటివరకు 180 కోట్లు డోసులను పంపిణీ చేశారు. రేపటి నుంచి టీకా కార్యక్రమంలో మరో దశ ప్రారంభంకానుంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు టీకాను అందించనున్నట్లు, వీరితోపాటు వృద్ధులకు ప్రికాషనరీ డోసు కూడా పంపిణీ చేయనున్నట్లు  కేంద్రారోగ్యశాఖ వెల్లడించింది. .

Post a Comment

0Comments

Post a Comment (0)