కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకివ్వరు?

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని మంత్రి విమర్శించారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ట్వీట్​ చేశారు. అన్ని అర్హతలున్నప్పటికీ కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా. అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్​ గుర్తు చేశారు. కర్ణాటక చేపట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా కల్పించింది. ఈ మేరకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అప్పర్‌భద్ర ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2018-19 ధరల ప్రకారం రూ.16,125.48 కోట్లు కాగా, ఇందులో రూ.4,868.31 కోట్లను కర్ణాటక ప్రభుత్వం ఖర్చుచేసింది. మిగిలిన నిధులను జాతీయ హోదా కింద కేంద్రం భరించనుంది. దక్షిణాదిలో పోలవరం తర్వాత జాతీయ హోదా లభించిన ప్రాజెక్టు ఇదే.


Post a Comment

0Comments

Post a Comment (0)