తెలంగాణ లో ఆశా కార్యకర్తలందరికీ త్వరలోనే స్మార్ట్ ఫోన్ ల పంపిణీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 22 February 2022

తెలంగాణ లో ఆశా కార్యకర్తలందరికీ త్వరలోనే స్మార్ట్ ఫోన్ ల పంపిణీ

తెలంగాణలోని ఆశా కార్యకర్తలందరికీ త్వరలోనే స్మార్ట్ ఫోన్ ల పంపిణీ చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. వికారాబాద్ జిల్లాలో ఆశా కార్యకర్తలకు ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో కలిసి స్మార్ట్ ఫోన్ లను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని రాష్ట్రంలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశా కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయం అని చెప్పారు. ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రాణాలను ఫణంగా పెట్టి ఆశ వర్కర్లు చేసిన సేవ ఎంతో గొప్పదని.. కోవిడ్ ల్లో బాగా కష్టపడ్డ కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ లు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆశ కార్యకర్తల జీతాలను ముఖ్యమంత్రి కేసీఆర్ 3 వేల నుండి 9 వేలకు పెంచారని.. కోవిడ్ లో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల సదుపాయాలు కల్పించారన్నారు.

No comments:

Post a Comment