కడప, అనంతపురం జిల్లాల్లో లిథియం నిక్షేపాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా లింగాల మండలంలో నాలుగు గ్రామాలు, సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లాలో రెండు గ్రామాల్లో అరుదైన నిక్షేపాలున్నట్లు గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే లిథియం ఖనిజ నిక్షేపాలున్నట్లు జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వేలో గుర్తించారు. శాస్త్రవేత్తలు కొన్ని నెలల కిందట కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లె, లోపటనూతల, కోమనూతల, తాతిరెడ్డిపల్లె, సరిహద్దుల్లో అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం తురకవారిపల్లె, దాడితోట ప్రాంతాల్లో క్షేత్ర పరిశీలన ద్వారా మట్టి, శిలలు, ప్రవాహ నిక్షేపాలు సేకరించి పరీక్షించగా లిథియం నిక్షేపాలుగా తేల్చారు. ఈ ఖనిజాన్ని మొబైల్‌ఫోన్లు, డిజిటల్‌ కెమెరాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలకు వినియోగించే లిథియం బ్యాటరీల తయారీకి వినియోగిస్తారు. కడప, అనంతపురం జిల్లాల్లో లిథియం నిక్షేపాలున్నట్లు ఇటీవల పార్లమెంటులో కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి దృవీకరించారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. దీంతో జీఎస్‌ఐ సర్వేలు నిర్వహించడం, లిథియం నిక్షేపాలున్నట్లు గుర్తించడం లాంటి పరిణామాల నేపథ్యంలో అధికారికంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినట్లయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)