వద్దొద్దు నా కాళ్ళ మీద పడొద్దు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 13 February 2022

వద్దొద్దు నా కాళ్ళ మీద పడొద్దు!


ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుపడిన వ్యక్తులను మోహన్ బాబు 'నాకు నమస్కారం పెట్టారా? నాకు గుడ్ మార్నింగ్ చెప్పారా?' అని  అడుగుతారని జనసేన నేత కళ్యాణ్ దిలీప్ సుంకర వ్యాఖ్యలు చేశారు. అయితే శనివారం నాడు మోహన్ బాబు నటించిన "సన్నాఫ్ ఇండియా" ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో జరిగిన ఓ ఉదంతం సోషల్ మీడియా ట్రోలింగ్ కు కారణమైంది. కళ్యాణ్ దిలీప్ సుంకర చెప్పిన దానికి, ఈ వేదిక పైన జరిగిన దానికి పోలిక ఉండడం గమనించదగ్గ విషయం. దర్శకుడు డైమండ్ రత్నబాబు గురించి మోహన్ బాబు మాట్లాడుతున్న సందర్భాల్లో డైరెక్టర్ వచ్చి కరచాలనం చేయగా, 'వద్దొద్దు అట్లాంటి పని చేయొద్దు, నువ్వు గబుక్కున నా కాళ్లకు నమస్కారం చేద్దామని ఆలోచిస్తున్నావు, కాళ్లకు నమస్కారం చేయమని చెప్పను, నాకు ఇష్టం లేదు, నువ్వు అట్లా చూసావు, చేద్దామా వద్దా ఏమైనా అనుకుంటాడేమో అని, నువ్వు చేస్తే నాకు అగౌరవం' అంటూ మోహన్ బాబు అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఈ వీడియోలో గమనించదగ్గ విషయం ఏమిటంటే. మోహన్ బాబు ప్రసంగిస్తున్న సమయంలో పక్కనే ఉన్న అలీ అండ్ కో నవ్వులతో మునిగిపోయారు. అదే నవ్వులు నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు. 

No comments:

Post a Comment