మధ్యప్రదేశ్‌లో బయటపడిన డైనోసార్ గుడ్లు

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లో రాక్షసబల్లుల గుడ్లు కొన్ని బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బడవాన్ అడవిలో 10 గుడ్లు బయటపడ్డాయి. ఈ గుడ్ల వయస్సు సుమారు కోటి సంవత్సరాలకు పైగా ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు పురాతన శిల్పాలు, కోటలు తదితర వాటిపై సర్వేలు నిర్వహిస్తున్న సమయంలో సెంధ్వా జిల్లాలోని హింగ్వా గ్రామ సమీపంలోని అడవిలో 10 గుడ్లు బయటపడ్డాయి. ఈ 10 గుడ్లలో ఒకటి 40 కిలోల వరకు బరువు ఉండగా, మిగతావి 25 కిలోల వరకు బరువు ఉన్నాయి. ఈ డైనోసార్ రాతి గుడ్లను ఇండోర్ లోని మ్యూజియంకు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)