బీపీ - లక్షణాలు

Telugu Lo Computer
0


ఆధునిక పోటీ ప్రపంచంలో ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా తక్కువైపోయింది. ఆనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరో కారణం. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. లో బీపీ అనేది ప్రస్తుతం సాధారణంగా ఎదురవుతున్న ప్రధాన సమస్య. లో బీపీని పట్టించుకోకపోతే అది ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతుంది. లోబీపీనే హైపర్ టెన్షన్‌గా అని కూడా పిలుస్తారు. రక్త ప్రసరణ 90/60 కంటే తక్కువగా ఉంటే..లో బీపీ ఉన్నట్టు అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే సాధారణ రక్త ప్రసరణ ఆరోగ్యకరమైన మనిషిలో 120/80 ఉండాలి. చాలా మంది లో బీపీని లైట్‌గా తీసుకుంటారు. ఏమీ కాదులే అనే భావనతో ఉంటారు. ఫలితంగా మెడికేషన్, షాక్, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. హైపో టెన్షన్ అనేది నిజంగానే సీరియస్ సమస్య. అయితే దీన్నించి విముక్తి పొందడం కూడా అంత కష్టమేం కాదు. జీవన శైలి, డైట్ సరిగ్గా మార్చుకుంటే లో బీపీ సమస్యను నియంత్రించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. మనిషి శరీరంలో అవసరమైన నీరు లేకపోవడంత కలిగే డీ హైడ్రేషన్ లో బీపీ అవకాశాల్ని పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ కచ్చితంగా 7-8 గ్లాసుల నీరు తాగాల్సిందేనంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో నీటి షార్టేజ్ ఉండదు. మీరు తీసకునే డైట్ అనేది నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మరోవైపు మీరు ఒకవేళ లో బీపీతో బాధపడుతున్నట్టయితే విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్, ఐరన్‌ను డైట్‌లో చేర్చుకోండి. బీపీను ఇవి అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా మొత్తం భోజనం ఒకేసారి తీసుకోకుండా..తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకేవడం మంచిది. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మీ రక్త ప్రసరణ తగ్గవచ్చు. ప్రత్యేకించి వృద్ధుల్లో. ఎందుకంటే భోజనం తరువాత రక్త ప్రసరణ జీర్ణ వ్యవస్థ వైపుకు ప్రవహిస్తుంది. బీపీ తగ్గిపోతుంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. రక్తంలో సోడియం రక్త ప్రసరణను పెంచుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా శరీరంలో డీ హైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. వీలైనంతవరకూ ఆల్కహాల్ మానేయడం మంచిది. లేదా తగ్గించండి. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా...లో బీపీ  సమస్య వెంటాడుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు అప్పుడప్పుడూ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్ వల్ల లో బీపీ సమస్య తీవ్రం కావచ్చు. చాలా సందర్భాల్లో బ్యాక్టీరియల్, వైరస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్  కారణంగా లో బీపీ సమస్య అధికమవుతుంది. అందుకే ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఇన్‌ఫెక్షన్స్ సోకితే మాత్రం తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)