జీవవైవిధ్యానికి పామాయిల్ ముప్పు : పర్యావరణ వేత్తలు

Telugu Lo Computer
0


ఉష్ణమండలంలో మాత్రమే పెరిగే ఆయిల్ పామ్ చెట్టు అధిక నాణ్యతతో కూడిన నూనెను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ప్రధానంగా వంటకోసం ఉపయోగిస్తారు. కానీ పలు ఆహార ఉత్పత్తులు, డిటర్జెంట్లు, సౌందర్య సాధనాలతో పాటు కొంత వరకు జీవ ఇంధనాల్లో కూడా వినియోగిస్తారు. అమెరికా ఆహారంలో పామాయిల్‌ను తక్కువగానే యూజ్ చేస్తున్నాఅమెరికన్లు వినియోగించే సగానికి పైగా ప్యాక్డ్ ఉత్పత్తుల్లో పామాయిల్‌ తప్పక ఉంటుంది. లిప్‌స్టిక్స్, సబ్బులు, డిటర్జెంట్స్, టూత్‌పేస్ట్, సోప్స్, బిస్కెట్స్, బ్రెడ్, చాక్లెట్, ఐస్‌క్రీమ్‌ల తయారీలో ఈ ఎడిబుల్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. వాస్తవానికి సోయా, పొద్దుతిరుగుడు, ఆవాలు, కొబ్బరి, వేరుశెనగ, నువ్వులు వంటి వాటితో పోల్చితే పామాయిల్ పంట ఎక్కువ ప్రయోజనకరమైన, మంచి ఉత్పాదక పంట. అంతేకాదు తక్కువ ధరలు న్యూట్రల్ టేస్ట్ /ఓడర్ ప్రొఫైల్ కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు మూడు బిలియన్ల మంది దీన్ని వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని డిమాండ్ వేగంగా పెరుగుతుండటంతో అటు రైతులు, ఇటు వినియోగదారులకు లాభదాయకంగానే కనిపిస్తుంది. అయితే ప్రపంచ పామాయిల్‌ ఉత్పత్తిలో దాదాపు 85% ఇండోనేషియా, మలేషియాల్లోనే సాగవుతుంది. కానీ ఈ పంట అటవీ నిర్మూలన జరిగి కాలుష్యం పెరిగిపోవడంతో పాటు వన్యప్రాణులు అంతరించిపోయేందుకు కారణమవుతోంది. దీంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, పామాయిల్ దాదాపు సగం అటవీ నిర్మూలనకు కారణమవుతుందని అంచనా. దీంతో జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది. పామాయిల్ పంట సమీపంలోని నేల, జల కాలుష్యానికి దారితీస్తుంది. వీటి సాగు కోసం అడవులు నరకడం వల్ల వాయు కాలుష్యానికి కారణమవుతోంది. గ్లోబల్ వార్మింగ్‌ కూడా పెరుగుతోంది. $40 బిలియన్ పామాయిల్ పరిశ్రమ వర్షారణ్యాలను తుడిచిపెట్టడంతో పాటు, వాతావరణంలోకి కార్బన్‌ను వెదజల్లుతుంది. తోటల కోసం భూమిని క్లియర్ చేయడంలో రెయిన్‌ఫారెస్ట్‌ను తగలబెట్టడం వల్ల ఒరంగుటాన్ సహా అరుదైన జాతులు ప్రమాదంలో పడుతున్నాయి. పీట్‌ల్యాండ్‌లో సంప్రదాయ అటవీ మంటల కంటే 100 రెట్లు గ్రీన్‌హౌస్ వాయువును విడుదల చేస్తుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)