రేషన్‌కార్డుదారులకు కొత్త నిబంధనలు ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 25 February 2022

రేషన్‌కార్డుదారులకు కొత్త నిబంధనలు ?ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం  ప్రయోజనాన్ని పొందుతున్నారు. వీరిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు చాలా మంది ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కొన్ని మార్పులు చేస్తుంది. వాస్తవానికి ఇప్పుడు కొత్త ముసాయిదా పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. ఇందుకు సంబంధించి గత ఆరు నెలలుగా రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆహార, ప్రజాపంపిణీ శాఖ తెలిపింది. రాష్ట్రాలు ఇచ్చే సూచనలను పొందుపరిచి కొత్త నిబంధనలని సిద్దం చేస్తున్నారు. ఈ ప్రమాణాలు త్వరలో ఖరారు కానున్నాయి. కొత్త నిబంధనల అమలు తర్వాత అర్హులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. అనర్హులు ప్రయోజనం పొందలేరు. అవసరార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేస్తున్నారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ ప్రకారం.. ఇప్పటి వరకు 'ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్ పథకం' డిసెంబర్ 2020 వరకు 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేస్తున్నారు. దాదాపు 69 కోట్ల మంది లబ్ధిదారులు అంటే ఎన్ఎఫ్ఎస్ఏ కింద వచ్చే జనాభాలో 86 శాతం మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి నెలా దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు మారడం ద్వారా లబ్ధి పొందుతున్నారు

No comments:

Post a Comment