కర్ణాటకలో వెలుగు చూసిన దారుణ ఘటన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 23 February 2022

కర్ణాటకలో వెలుగు చూసిన దారుణ ఘటన


కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కోరటగెరె పట్టణంలో సావిత్రమ్మ (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. సావిత్రమ్మకు శైలజా (21) అనే కూతురు ఉంది.  సావిత్రమ్మ అక్కకు పునీత్ (26) అనే కొడుకు ఉన్నాడు. చిన్నాన, పెద్దనాన్న పిల్లలు కలసి మెలసి ఉంటున్నారు. ఇదే సమయంలో ఆడపిల్లలు, మగ పిల్లలు కలసి ఆడుకుంటున్నారు. అందరూ వరుసకు అన్నాచెళ్లెళ్లు కావడంతో ఎవ్వరికి అనుమానం రాలేదు. ఈ సమయంలోనే సావిత్రమ్మ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సావిత్రమ్మ ఇంటి ముందే నీటి సంపులో శవమై కనిపించండంతో అందరూ హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేసి వివరాలు బయటకు లాగారు. పోలీసుల విచారణలో ఇంతకాలం వెలుగు చూడని విషయాలు బయటకు రావడం సావిత్రమ్మ కుటుంబంలో కలకలం రేపింది. సావిత్రమ్మ అక్క కొడుకు పునీత్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. వరుసకు అన్నాచెల్లెలు అయిన శైలజా, పునీత్ ల లవ్ స్టోరీ బయటకు రావడం, ఇదే విషయంలో శైలజా తల్లి సావిత్రమ్మ హత్యకు గురైయ్యిందని వెలుగు చూడటం స్థానికంగా కలకలం రేపింది. శైలజా, పునీత్ చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. అయినప్పటికీ ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. చాలాకాలం నుంచి పునీత్, శైలజాల అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. అయితే ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా శైలజా తల్లి సావిత్రమ్మకు చిక్కిపోయారని, ఆ సమయంలో మీరు అన్నాచెల్లెలు, ఇలా చెయ్యడం మంచిది కాదని సావిత్రమ్మ ఇద్దరిని హెచ్చరిచిందని తెలిసింది. విషయం అమ్మకు తెలిసిపోయిందని శైలజా భయపడిపోయింది. అంతే వయసుకు అన్న అయిన ప్రియుడు పునీత్ తో కలిసి సావిత్రమ్మను ఆమె కూతురు గొంతు నులిమి చంపేసి శవాన్ని ఇంటి ముందు ఉన్న నీటి సంపులో వేసి ప్రమదవశాత్తు నీటి సంపులో పడి చనిపోయిందని నాటకాలు ఆడారని పోలీసు విచారణలో వెలుగు చూసింది. తల్లి సావిత్రమ్మను హత్య చేసిన శైలజా, ఆమెకు వరుసకు సోదరుడు అయ్యే ప్రియుడు పునీత్ ను అరెస్టు చేసినట్లు తుమకూరు పోలీసులు అధికారులు తెలియజేశారు. 


No comments:

Post a Comment