వివాహితపై లైంగిక దాడి

Telugu Lo Computer
0


తెలంగాణ లోని ఆదిలాబాద్‌ జిల్లా లోకేశ్వరం మండలం నగర్‌ గ్రామానికి చెందిన మహిళకు 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. బతుకుదెరువు కోసం భర్త దుబాయ్‌ వెళ్లగా ఇద్దరు చిన్నపిల్లలతో ఇంట్లోనే ఉంటోంది. గత నెల 24న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఫారుక్, అజామ్‌లు తలుపులు కొట్టాడు. వివాహిత కిటికిలో నుంచి చూసి తలుపులు తీయలేదు. ఫారుక్‌ తలుపులు తొలగించి లోపలికి వచ్చి చేయి పట్టుకుని కొట్టి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయగా పక్కనే ఉన్న మామ ఎవరని అరవగా అతడు పారిపోయాడు. ఎవరికైన చెబితే ఇద్దరు పిల్లలను చంపుతానని బెదిరించడంతో ఈ విషయం చెప్పలేదు. రెండు రోజుల క్రితం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం మధ్యాహ్నం బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై సాయికుమార్‌ని వివరణ కోరగా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)