తవ్వకాల్లో బయటపడ్డ మెట్లు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 February 2022

తవ్వకాల్లో బయటపడ్డ మెట్లు!


చార్మినార్ నుంచి గోల్కండ వరకు సొరంగ మార్గం ఉందని ప్రచారం ఉంది. ఈ క్రమంలో చార్మినార్ వద్ద మంగళవారం చేపట్టిన తవ్వకాల్లో భూగర్భంలో మెట్లు బయటపడ్డాయి. విషయం తెలిసిన పత్తర్‌గట్టీ కార్పొరేటర్ సోహెల్‌ ఖాద్రీతోపాటు మజ్లిస్ నేతలు అక్కడికి చేరుకుని తవ్వకాలపై అధికారులను ప్రశ్నించారు. దీంతో కాసేపు అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పురాతత్వ సర్వేక్షణ విభాగం హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ స్మిత, చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి తవ్వకాల వెనకున్న కారణాలను వివరించడంతో నేతలు సద్ధుమణిగారు. చార్మినార్‌ను పిడుగు ప్రమాదం నుంచి రక్షించేందుకు పురాతత్వ అధికారులు గత కొన్ని రోజులుగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నాలుగు మినార్లకు ఇత్తడి తీగలు ఏర్పాటు చేసి వాటిని భూమికి అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టారు. జనరేటర్ ఏర్పాటు చేసేందుకు మంగళవారం తవ్వకాలు చేపట్టగా భూమిలో కూరుకుపోయిన మెట్లు బయటపడ్డాయి.హైదరాబాద్ లోని గొల్కొండకు ఎన్నో ప్రదేశాలనుంచి సొరంగ మార్గాలు ఉన్నాయని ప్రచారం ఉంది. దీంట్లో భాగంగానే సైఫాబాద్, రాజభవన నుంచి కూడా గోల్కొండకు సొరంగ మార్గాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అలాగే గతంలో పేట్ల బరుజులో ఓ సొరంగం కూడా బటయడపడటం, బెల్లా విష్టా ప్యాలెస్  లోను ఓ బంకర్ ను గతంలో గుర్తించారు. ఇలా ప్రసిద్ధ కట్టడమైన చార్మినార్ చాటున ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కాగా చార్మినార్ వద్ద బయటపడ్డ భూ గర్భ మెట్లను అధికారులు ఆ గుంటలను తిరిగి పూడ్చివేశారు.

No comments:

Post a Comment