నమ్రత జీతం నెలకు కోటి

Telugu Lo Computer
0


సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పలువురు హీరోలు, హీరోయిన్లు సినిమాల  సంపాదనతో పాటు  పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. తమ వాళ్లనే ఆయా వ్యాపారాల్లో సహాయకులుగా లేదా మేనేజర్లుగా పెట్టుకుంటున్నారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు భార్య నమత్రా శిరోద్కర్ మహేష్‌బాబు కెరీర్ ప్లానింగ్‌లో ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంటుందో తెలిసిందే. మాజీ మిస్ ఇండియా, నటి నమ్రత శిరోద్కర్ మహేష్‌బాబును 2005లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఉన్న ఆమె తెలుగులో వంశీ సినిమాలో మహేష్ పక్కన నటించింది. ఆ టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే వీరి పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన ఆమె గృహిణిగా ఉండడంతో పాటు ఇటు మహేష్ కెరీర్ ప్లానింగ్‌, మహేష్ వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. ముంబైలో సినిమా, వ్యాపార కుటుంబానికి చెందిన నమత్ర తండ్రికి చెందిన వ్యాపార విషయాల్లో పెళ్లికి ముందే మంచి గ్రిప్ తెచ్చుకున్నారు. గౌతమ్ పుట్టాక మహేష్‌కు వరుస ప్లాపులు వచ్చాయి. ఆ సమయంలో నమ్రత మహేష్‌కు పూర్తి అండగా నిలిచారు. దూకుడు సినిమా నుంచి మహేష్ ట్రాక్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అప్పటి నుంచి నమ్రత మహేష్‌కు సహాయకురాలిగా, మేనేజర్‌గా ఉంటున్నారు. మహేష్ కథలు విన్నాక.. నమ్రతతతో చర్చించాకే నిర్ణయం తీసుకునేవాడు. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతోంది. మహేష్‌కు ఎలాంటి కాస్ట్యూమ్స్ సూట్ అవుతాయో కూడా నమత్రకు బాగా తెలుసు. అందుకే ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటుంది. మహేష్ సినిమాల్లో సంపాదించిన డబ్బును వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చేయడంలో కూడా నమ్రతే ప్రణాళికలు రెడీ చేస్తోందట. ఆమె బిజినెస్ ఆలోచనలో నచ్చి వ్యాపారాలు అన్నీ కూడా ఆమెకే అప్పగించేశాడు. ఇక శ్రీమంతుడును సినిమాను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు నమ్రత స్పెషల్‌గా ఓ ఆఫీస్ స్టార్ట్ చేసి మరీ.. ఓం టీంను పెట్టుకుని.. అద్భుతమైన ప్లానింగ్ చేసింది. అప్పటి నుంచి ప్రతి సినిమా ప్రమోషన్ల విషయంలో ఎప్పటికప్పుడు మహేష్ పీఆర్ టీంతో కోపరేట్ చేసుకుని ఆమె సక్సెస్ అవుతున్నారు. ఇక మహేష్ డబ్బుతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, నిర్మాణ సంస్థ ఎంబీ ప్రొడక్షన్స్ నుంచి, సినిమా హాళ్లు ,రియల్ ఎస్టేట్ విభాగాల్లో కూడా ఆమె పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చూసుకోవడానికి జీతం రూపంలోనే నెలకు ఆమె కోటి పైన తీసుకుంటున్నారట. ఎంత సొంత వ్యాపారాలు అయినా జీతం తీసుకున్నాక.. మిగిలిన మొత్తాన్నే లాభం కింద కౌంట్ చేయడం మామూలే..!


Post a Comment

0Comments

Post a Comment (0)