పట్టు తప్పితే పెళ్లి కాస్తా పెటాకులయ్యేది!

Telugu Lo Computer
0


పెళ్లి తంతు ముగిసిన తర్వాత వధువు, వరుడు వరమాలలు మార్చుకునే ఆచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న బంధువులు వధూవరులిద్దరినీ అమాంతం పైకి ఎత్తి పట్టుకున్నారు. వారిద్దరూ స్టేజ్ పై ఉన్న ఐరన్ ఫ్రేమ్‏ను పట్టుకుని నిల్చునేందుకు ట్రై చేశారు. ఇక ఇదే హడావిడిలో వరుడు వధువు మెడలో సులభంగా వరమాల వేశాడు. పాపం వధువు వరుడి మెడలో వరమాల వేయడానికి చాలా కష్టపడింది. వరుడి షర్ట్ పట్టుకుని తనవైపు లాక్కుంటూ మెడలో వరమాలను విసిరివేసి.. ఆ తర్వాత వరమాలను సెట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాస్తా పట్టు తప్పితే పెళ్లి కాస్తా పెటాకులయ్యేది.. పిచ్చి అంటే వినటమే.. కానీ చూస్తున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)