బాలకృష్ణ సీఎం అపాయింట్ మెంట్ కోరారు!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధర ముగిసినట్లే ముగిసి మళ్ళీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. మెగా భేటీ అనంతరం ఏపీలో టికెట్ ధరల అంశం కొలిక్కి వచ్చినట్లే అనుకున్నారు. త్వరలోనే కొత్త టికెట్ ధరలు వస్తాయని.. మిగతా సినిమా సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని ఇరు వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ.. తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల నేపథ్యంలో దాదాపుగా రాష్ట్రమంతా మళ్ళీ అదే సమస్యలు కనిపించాయి. పలు చోట్ల థియేటర్లు మూతపడడంతో పవన్ ఫ్యాన్స్ పలు చోట్ల రాస్తారోకోలు కూడా చేశారు. ఒకవిధంగా థియేటర్ల సమస్య.. టికెట్ ధరల తగ్గింపు.. ఎప్పుడో రాజకీయ మార్పు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విడుదల నేపథ్యంలో ఇది అదే రాజకీయ సమస్యగా కొనసాగింది. పవన్ స్వతహాగా ఓ పార్టీ అధ్యక్షుడు కాగా.. ప్రతిపక్ష పార్టీ నుండి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ ఈ సమస్యపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనికి మంత్రి పేర్ని నానీ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై కూడా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా విడుదలకి ముందు రోజు నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ద్వారా ఆ సినిమా నిర్మాతలు విజయవాడ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ కి వచ్చి తనను కలిశారని.. బాలకృష్ణ గారు కూడా ఫోన్ లో తనతో మాట్లాడారని.. నేను సీఎం జగన్ గారిని కలుస్తా అపాయింట్ మెంట్ కావాలని కూడా బాలకృష్ణ తనతో చెప్పారని.. ఆ విషయాన్నీ సీఎం గారికి చెప్పానని మంత్రి చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఎందుకు కలవాలని అనుకుంటున్నారని సీఎం జగన్ నన్ను అడిగారని.. అఖండ సినిమా రిలీజ్ గురించి అని తాను సీఎంకు చెప్పానని.. దానికి సీఎం.. బాలకృష్ణ గారి క్యారెక్టర్ దెబ్బతింటుంది వద్దని నాతో చెప్పారని పేర్ని నానీ చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)