దొంగలకు ఝలక్ ఇచ్చిన యువతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 25 February 2022

దొంగలకు ఝలక్ ఇచ్చిన యువతి


సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు దొంగలు ఒక యువతి హ్యాండ్ బ్యాగ్ ను దొంగలించారు. ఆ యువతి దొంగలతో చాలాసేపు కొట్లాడింది. తర్వాత తెలివిగా ప్రవర్తించి ఆ దొంగల స్కూటీని తీసుకొని ఎంచక్కా అక్కడి నుంచి పరారైంది. దీంతో దొంగలకే దొంగ అన్న చందాన ఆమె ఇచ్చిన ట్విస్ట్ చూసి సదరు దొంగలనోట్ల వెలక్కాయ పడినట్లయింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి, తలకు హెల్మెట్ పెట్టుకుని ఒక స్కూటీపై కూర్చొని ఒక వ్యక్తి అటువైపుగా వస్తుండగా అతని చేతిలో నుంచి మొబైల్ కొట్టేయడానికి ఒక దొంగ ప్రయత్నించాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో ఆ వ్యక్తి తన ఫోన్ ని పైకి లేపి చెవి దగ్గర పెట్టుకున్నాడు. దీంతో దొంగ ప్రయత్నం విఫలం అయింది. అయినప్పటికీ సదరు దొంగలు ఏదో ఒకటి కాజేయాలని అక్కడే నిల్చొని కాపు కాశారు. ఇంతలో ఒక యువతి అదే రోడ్డుపై నడుచుకుంటూ రావడం గమనించవచ్చు. దీంతో ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లాక్కొనడానికి ట్రై చేశాడు ఒక దొంగ. అయితే ఆ యువతి అతడితో చాలా సేపు కొట్లాడింది. అయినప్పటికీ తన హ్యాండ్ బ్యాగ్ ను దొంగ బలంగా లాగేసుకున్నాడు. దీంతో ఆమె తెలివిగా ఆలోచించి దొంగలు తీసుకొచ్చిన స్కూటీపై ఎక్కి అక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. దీంతో చిన్న హ్యాండ్ బ్యాగ్ కోసం పెద్ద స్కూటీ కోల్పోయామని దొంగలు షాక్ తిన్నారు. ఆ తర్వాత అమ్మాయి వెంట పడ్డారు.  అయితే ఈ వీడియోలో జరిగిన దొంగతనం నిజమైనది కాదని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన పెంచడానికే ఇలా కొందరు వ్యక్తులు సీసీటీవీ ఫిల్టర్ ఆన్ చేసి స్క్రిప్ట్టెడ్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఇలాంటి దొంగలు నిజంగానే ఉంటారని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. దొంగల తెలివితేటలు తెల్లారినట్లు ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

No comments:

Post a Comment