వెలుగులోకొచ్చిన పీఈటీ టీచర్ అకృత్యాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 February 2022

వెలుగులోకొచ్చిన పీఈటీ టీచర్ అకృత్యాలు


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం లోని శ్రీధర గట్ట గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక విద్యార్థినికి ఫోన్ ద్వారా ఆడియో చాటింగ్ చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడం ఇదే సమయంలో సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు సెలవులో ఉండటంతో దీనిలో నిజాలు నిగ్గు తేల్చేందుకు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేయిస్తున్నట్లు తెలిసింది. వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇంట్లో ఉన్న మొబైల్‌కు ప్రతి రోజు ఫోన్ చేస్తూ చాటింగ్ చేస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ తన భార్యకు ఒక ఏడాది నుంచి ఆరోగ్యం బాగా లేదని తన కోరిక పై రూమ్‌లోకి వచ్చి నీవే తీర్చాలని చాటింగ్ చేసిన మాటలు రికార్డు అయ్యాయి. ఇలాంటి మాటలు రికార్డు కావడంతో ఆయన మాట్లాడిన మాటలు బయటకు చెబితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని ఎవరికీ చెప్పకుండా మనసులో దాచుకుంది. ఒకరోజు విద్యార్థిని ఇంట్లో లేని సమయంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఫోన్ చేయగా వారి కుటుంబ సభ్యులు లిఫ్ట్ చేయడంతో అసలు విషయం బయట పడినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు వ్యాయామ ఉపాధ్యాయుడు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల పరువు బయటకు పోక్కకుండా విషయాలనులో గుట్టుగా దాచి ఉన్నతాధికారులతో నిజాలను నిగ్గు తేల్చేందుకు విచారణ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది వ్యాయామ ఉపాధ్యాయుడు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ కీచక వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

No comments:

Post a Comment