ఆఫ్రికాలోనే రిచ్చెస్ట్ కిడ్ !

Telugu Lo Computer
0


ముహమ్మద్ అవల్ ముస్తఫా ఆకా మోంఫా జూనియర్ తండ్రి నైజీరియన్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాలియా ముస్తఫా. అతడు చాలా చిన్న వయసు నుండే తన కొడుకు మోంఫాకు చాలా లగ్జరీ జీవితాన్ని అందజేశాడు. ఆరేళ్ల వయసు నుండే మోంఫా ప్రైవేట్ జెట్‌లో తిరగడం మొదలుపెట్టాడు. మోంఫా జూనియర్ కేవలం బ్రాండెడ్ బట్టలు, గడియారాలు, బూట్లు ధరిస్తాడు. అంతే కాకుండా తన పేరుపై పెద్ద మ్యాన్షనే ఉంది. కొంతమంది తమ జీవితమంతా కష్టపడినా అలాంటి మ్యాన్షన్‌ను కట్టలేరు. కానీ మోంఫా జూనియర్ ఆరేళ్ల వయసులోనే దీనికి అధిపతి అయ్యాడు. మోంఫా జూనియర్‌కు, తన తండ్రికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. 9 ఏళ్ల వయసులోనే మోంఫా గడుపుతున్న విలాసవంతమైన జీవితం వల్ల తాను ప్రపంచంలోనే మోస్ట్ లగ్జరీ కిడ్‌గా పేరు సంపాదించుకున్నాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)