డయాబెటిస్ - లక్షణాలు

Telugu Lo Computer
0


చాలామందికి ఈరోజుల్లో షుగర్ అనేది కామన్ వ్యాధి. షుగర్ రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్లడం. డాక్టర్ రాసిచ్చిన మందులను రోజూ వేసుకొని షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం. నిజానికి షుగర్ అంటే ఏంటి.. దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి. దాని లక్షణాలు ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు.మనం ఏదైనా ఆహారం తింటే.. ఆ ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ను బాడీ షుగర్ గా మారుస్తుంది. దాన్నే గ్లూకోజ్ అంటాం. ఇందులో పాంక్రియాస్ అనే గ్రంథి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే.. షుగర్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1,   టైప్ 2 డయాబెటిస్.టైప్ వన్ డయాబెటిస్ పుట్టుకతోనే వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ మాత్రం పుట్టిన తర్వాత మధ్య వయసులో ఉన్నప్పుడు తినే ఆహారాన్ని బట్టి వస్తుంటుంది.ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొనేది టైప్ 2 డయాబెటిస్ నే. అసలు డయాబెటిస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి. బాగా దాహం వేయడం, మూత్ర విసర్జన అధికంగా చేయడం, అలసిపోయినట్టు ఉండటం, ఊరికే బరువు తగ్గడం, నోట్లో పుండ్లు అవడం, కంటిచూపు తగ్గడం, కళ్లు మసకగా మారడం, ఏవైనా గాయాలు అయితే తగ్గకపోవడం లాంటి లక్షణాలు ఉంటే షుగర్ వచ్చినట్టే అని అనుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే షుగర్ వచ్చినట్టే లెక్క. అయితే.. శరీరంలో ఉండాల్సిన షుగర్ లేవల్స్ కంటే తక్కువగా ఉంటే దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. అంటే.. షుగర్ లేవల్స్ తగ్గడం అన్నమాట. అది కూడా చాలా డేంజర్. షుగర్ లేవల్స్ పడిపోతే.. వణుకు వస్తుంది. నీరసంగా అనిపిస్తుంది. చెమటలు పడుతాయి. చిరాకు వస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది.ఇక ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ షుగర్ లేవల్స్ ఉన్నా ప్రమాదమే. అటువంటి వాళ్లు ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న వస్తువులను తినడం మానేయాలి. షుగర్ లేవల్స్ తక్కువగా ఉన్నవాళ్లు తక్షణ శక్తి కోసం పిండి పదార్థాలు ఉన్న ఫుడ్ ను తీసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)