బుజ్జగింపు రాజకీయాలు ఉండవ్ !

Telugu Lo Computer
0


దేశంలో వ్యవస్థ షరియత్, ఇస్లామిక్ చట్టంపై కాదని, భారత రాజ్యాంగంపై ఆధారపడి నడపాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ముస్లిం మహిళలకు గౌరవమిస్తూ ప్రధానమంత్రి మోదీ ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేశారని యోగి పేర్కొన్నారు. తమ వ్యక్తిగత మత విశ్వాసాలను దేశంలో విధించలేమని, యూపీలోని ఉద్యోగులందరూ కాషాయ కండువా ధరించమని నేను అడగవచ్చా అని ప్రశ్నించారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రధాని మోదీ హయాంలో ఘజ్వా-ఏ-హింద్ కల సాకారం కాదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.'సబ్కా సాత్, సబ్కా వికాస్' అనే సూత్రంతో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్నారని ఇక్కడ బుజ్జగింపు రాజకీయాలు ఉండవని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)