వర్ధన్నపేటలో ఇళ్ల కూల్చివేతపై ప్రజల ఆందోళన!

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇళ్లను మున్సిపల్‌ అధికారులు శనివారం తొలగింపు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితుల ఇళ్లను ముందస్తు సమాచారం లేకుండానే కూల్చివేయడంపై స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మున్సిపల్‌ అధికారులు సరైన నిబంధనలు పాటించకుండా ముందస్తు సమాచారం లేకుండా కూల్చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు కొందరికి 50 ఫీట్లు, మరికొందరికి 55, 58 ఇలా తోచిన విధంగా తొలగింపు చేపట్టడంపై అభ్యంతరం చేపట్టారు. పేదల ఇళ్లను తొలగిస్తూ.. కొందరి పైరవీలు ఉన్నవారి ఇళ్లను ముట్టుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నఫళంగా ఇళ్ల కూల్చివేత చేపట్టడంతో తాము కుటుంబంతో సహా రోడ్లపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్‌ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకొని బాధితులను సముదాయించి తొలగింపు పనులను కొనసాగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)