ఎమ్మార్వో కు 6 నెలల జైలు శిక్ష, 2వేల జరిమానా! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 19 February 2022

ఎమ్మార్వో కు 6 నెలల జైలు శిక్ష, 2వేల జరిమానా!


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన పింజరి కరీం సాబ్ అదే మండల పరిధిలోని కొత్తకోట గ్రామం సరిహద్దులో సర్వే నెం. 430/ 1లో 11 ఎకరాల 73 సెంట్ల తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన భూమికి సంబంధించి మ్యుటేషన్ నిమిత్తమై స్థానిక ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మార్వో శివశంకర నాయక్‌ గ్రామ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కరీం సాబ్ దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కరీం సాబ్ తనకు న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది చల్లా శివశంకర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు రైతు భూమిని మ్యుటేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మార్వో ఈ ఉత్తర్వులను పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఎమ్మార్వోకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం సి.బెళగల్ ఎమ్మార్వో సంబంధిత రైతు మ్యుటేషన్ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని తీర్పునిస్తూ మ్యుటేషన్ చేయాలని ఆదేశించింది. కాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అమలు చేయకపోవడంతో ఎమ్మార్వో శివశంకర నాయక్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధృవీకరించి ఆయనకు ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2,000 లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు వారాలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.

No comments:

Post a Comment