ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ నేడు  ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 36 ఏళ్ళ నా పోలీసు సర్వీస్ ముగింపుకు వచ్చిందని.. రెండేళ్ళ 8 నెలల పాటు రాష్ట్ర డీజీపీగా పని చేసే అవకాశం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. అందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు బాసటగా నిలబడే విధంగా పోలీసు పనితీరు, మైండ్ సెట్ మార్చేందుకు కృషి చేశానని.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని పోలీసు సామర్థ్యం పెరిగేందుకు పని చేశానని చెప్పారు. స్పందన, సైబర్ మిత్రా, దిశ యాప్ వంటి విధానాల ద్వారా బాధితులు భౌతికంగా పోలీస్ స్టేషన్ రానవసరం లేకుండా చేశామన్నారు. 36 శాతం ఫిర్యాదులు సాంప్రదాయేతర విధానంలో నమోదు అయ్యాయని.. మహిళలు, పిల్లల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పని చేశామని వెల్లడించారు. కోటి దిశా యాప్ డౌన్ లోడ్లను ముఖ్యమంత్రి లక్ష్యంగా పెడితే మేము కోటి పది లక్షల డౌన్ లోడ్ లు చేయగలిగామని.. దేశంలోనే భద్రతా యాప్‌లలో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన యాప్.. దిశా యాప్ అని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)