సోమవారం పీఎస్‌ఎల్వీ-సి52 ప్రయోగం! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 12 February 2022

సోమవారం పీఎస్‌ఎల్వీ-సి52 ప్రయోగం!


సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి52ను ప్రయోగించేందుకు లాంచ్‌ ఆథరైజేషన్‌ అంగీకారం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ప్రయోగ సన్నాహాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం షార్‌లో జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశంలో ఇస్రో నూతన చీఫ్‌ ఎస్‌ సోమనాధ్‌ పాల్గొన్నారు. సాయంత్రం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4:29 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌ డౌన్‌ కొనసాగించి, సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి52 రాకెట్‌ రోదసీలోకి దూసుకుపోనుంది.

No comments:

Post a Comment