రాహుల్ బజాజ్ కన్నుమూత - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 12 February 2022

రాహుల్ బజాజ్ కన్నుమూత


ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ ఆటో సంస్థ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆయన చనిపోయినట్లు బజాజ్ గ్రూప్ తెలిపింది. రాహుల్ బజాజ్ గత కొంత కాలంగా న్యూమోనియాతో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు బజాజ్ గ్రూప్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. రాహుల్ బజాజ్ 1972లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో ఆయనకు అనుబంధం ఉంది. దేశంలోని అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో రాహుల్ బజాజ్ ఒకరు. టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలకు కారణమైన బజాజ్ ఆటో సంస్థ రాహుల్ బజాజ్ సారథ్యంలో అగ్రస్థానికి వెళ్లింది. రాహుల్ బజాజ్ 2006 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేసి దేశానికి విశేష సేవలందించారు. రాహుల్ బజాజ్ జూన్ 10, 1938న జన్మించారు. ఆయన ఎకనామిక్స్ మరియు లాలో డిగ్రీ చేశారు. అనంతరం హోవార్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో పట్టా పొందారు. 1968లో బజాజ్ ఆటోలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేరి సంస్థ ఉన్నతిలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మభూషనణ్ అవార్డుతో సత్కరించింది. 

No comments:

Post a Comment