అందుబాటులో 11.02 కోట్ల వ్యాక్సిన్‌లు

Telugu Lo Computer
0


సుమారు 11.02 కోట్లకు పైగా వినియోగించని, తగినంత కరోనా వ్యాక్సిన్‌లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వీటిని అర్హులైన ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యక్ష సేకరణ విధానం ద్వారా 173.22 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉచితంగా అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో సుమారు 11.02 కోట్లకు పైగా వ్యాక్సిన్‌లు ఇప్పటికీ రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)