మలేషియా, కువైట్‌, ఖతార్‌ లలో ఎఫ్‌ఐఆర్‌ మూవీ బ్యాన్‌

Telugu Lo Computer
0


తాజాగా విష్ణు విశాల్‌  నటించిన చిత్రం ఎఫ్‌ఐఆర్‌ ఫిబ్రవరి11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్‌ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమాకు మూడు దేశాలు షాకిచ్చాయి. కువైట్‌, మలేషియా, ఖతార్‌లతో ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్‌ వెల్లడించాడు. సినిమాలోని ప్రధాన కంటెంట్‌ కారణంగా అక్కడ సెన్సార్‌ని క్లియర్‌ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో మలేషియా, కువైట్‌, ఖతార్‌ ఫ్యాన్స్‌కు హీరో విష్ణు విశాల్‌ క్షమాపణలు చెప్పాడు. కాగా ఈ సినిమాలో విష్ణు ముస్లిం యువకుడిగా నటించగా, గౌతమ్‌ మీనన్‌ పోలీసు అధికారిగా నటించాడు. మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)