క్రిస్ గేల్ కు నిరాశ!

Telugu Lo Computer
0


క్రిస్‌ గేల్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారీ షాట్లకు పెట్టింది పేరు. బలంగా బంతిని బాదితే అది స్టేడియం బయటపడ్డం ఖాయం. ధనాధన్ క్రికెట్ లో ఓ లెజెండ్. ఇప్పటికే వన్డే, టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన గేల్‌కు టి20ల్లో ఘనమైన రికార్డు ఉంది. త్వరలోనే తన సొంత మైదానం కింగ్ స్టన్ లోని సబీనా పార్క్ లో చివరి మ్యాచ్ ఆడి టీ-20 లతో పాటు అన్ని రకాల క్రికెట్ గుడ్ బై చెప్పాలని భావించాడు. ఇదే తన కోరికంటూ గతేడాది జరిగిన టీ-20 వరల్డ్ కప్ లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, లేటెస్ట్ గా క్రిస్ గేల్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది విండీస్ క్రికెట్ బోర్డు ఐర్లాండ్, ఇంగ్లండ్ లతో జరిగే టీ-20 ల కోసం ప్రకటించిన జట్టులో క్రిస్ గేల్ కు చోటు కల్పించలేదు. దీంతో, తన సొంత ప్రేక్షుకుల మధ్య చివరి మ్యాచ్ ఆడాలనుకున్న గేల్ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. విండీస్ ఈ జనవరిలో తొమ్మిది మ్యాచులు ఆడనుంది. అందులో మూడు వన్డేలు, ఆరు టీ-20 లు ఉన్నాయ్. అయితే, ఈ ఆరు టీ-20ల్లో ఒకదాంట్లో కూడా క్రిస్ గేల్ కు చోటు కల్పించలేదు. దీంతో క్రిస్ గేల్ ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.  టీ-20 క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి క్రిస్ గేల్ ను మరీ ఇంతలా అవమానించడం తగదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, విండీస్ క్రికెట్ బోర్డు దీనిపై స్పందించింది. క్రిస్ గేల్ ఫేర్ వేల్ కు ఇది సరియైన సమయం కాదు.. త్వరలోనే అతని రిటైర్మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటూ తెలిపింది. క్రిస్ గేల్ తన కెరీర్‌లో 452 టి20 మ్యాచ్‌లాడిన గేల్‌ 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అందులో 87 హాఫ్‌ సెంచరీలు.. 22 సెంచరీలు ఉన్నాయి. ఇక వెస్టిండీస్‌ తరపున గేల్‌ 79 మ్యాచ్‌ల్లో 1884 పరుగులు సాధించాడు. టి20 ప్రపంచకప్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా గేల్‌ చరిత్రలో నిలిచిపోయాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)