అలా కూర్చోవడమంటే తమను అవమానించడమే!

Telugu Lo Computer
0

 

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ వివాదంలో ఇరుక్కున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అల్‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా పాక్ విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే పాక్ మంత్రి సౌదీ రాయబారి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం పై సౌదీ వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా తమ రాయబారి ముందు కూర్చోవడమంటే తమను అవమానించడమేనని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ రాయబారి మాత్రం చాలా హుందాగా, ప్రోటోకాల్ ప్రకారమే కూర్చున్నారని, పాక్ మంత్రి మాత్రం ఇవేవీ పాటించకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారని మండిపడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్‌లోని కొందరు పౌరులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనను తప్పుపట్టారు. అవసరమైతే పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ఆర్ధిక సహాయం చేస్తుందని, ఓ అధికారిక సమావేశంలో అలా కూర్చోవడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. ఇంకొకరు స్పందిస్తూ. ‘తాను ఈ సమావేశంలో ఉంటే మాత్రం ఆయన చర్యను చూసి.. నిరభ్యంతరంగా బయటికి వచ్చేసేవాడ్ని’ అంటూ వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)