ఆరు నెలల్లో మహమ్మారి అంతం ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 5 January 2022

ఆరు నెలల్లో మహమ్మారి అంతం ?


ఆరు నెలల్లో కరోనా అంతం కానుందన్న వార్త ఇప్పుడు యావత్‌ ప్రపంచానికి సాంత్వన చేకూరుస్తోంది. దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇంకా కొనసాగుతున్నప్పటికీ రానున్న రోజుల్లో ఇది స్థానికంగా ఎప్పటికీ ఉండిపోయే ఎండెమిక్‌ దశలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న ఆరు నెలల్లోనే కొవిడ్‌-19 ఎండెమిక్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త వేరియంట్లు వెలుగు చూసినంత మాత్రాన అవి థర్డ్‌ వేవ్‌కు కారణమవుతాయని కచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు నిపుణులు. కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకమని ఎన్సిడిసి డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 కోట్ల డోసులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. భారత్‌లో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి కొవిడ్‌-19 మారుతున్నట్లు కనిపిస్తోందని WHO ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఈమధ్యే వెల్లడించారు. భారత్‌లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే.. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కొవిడ్‌ ప్రస్తుత తరహాలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. 2022 ఆఖరు నాటికి.. 70% వ్యాక్సినేషన్‌ పూర్తయి, కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయన్న ఆశాభావాన్ని సౌమ్య స్వామినాథన్‌ వ్యక్తం చేశారు. ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లతో సతమతమవుతోన్న జనానికి వైద్య నిపుణుల మాట కొంతలో కొంత ఊరట కలిగిస్తోంది.

No comments:

Post a Comment