మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులకూ జైలు!

Telugu Lo Computer
0


కొద్దిరోజుల నుంచి విద్యార్థులు, మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు... వారికి వాహనాలు ఎవరు ఇస్తున్నారు? వాహనాలు నడపడంలో అనుభవం ఉందా? రాత్రివేళల్లో బైకులు, కార్లు నడిపేప్పుడు మద్యం తాగుతున్నారా? అన్న అంశాలపై ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. తల్లిదండ్రులు, ప్రైవేటు సంస్థలు, మొబైల్‌యాప్‌ల ద్వారా బైకులు, కార్లు కిరాయికి ఇస్తున్న కంపెనీల నుంచి వాహనాలు వస్తున్నాయని గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4385 కేసులు నమోదు చేశారు. 30 శాతం మంది వారే.. బైకులు, కార్లు నడుపుతున్న యువకులు, మైనర్లు(ఇంటర్మీడియేట్‌ విద్యార్థులు) కొంతమంది తల్లిదండ్రులతో పోట్లాడి ద్విచక్రవాహనాలను కొనాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. కళాశాలకు తాము బస్సుల్లో వెళ్తున్నామని, స్నేహితులంతా బైక్‌లలో వస్తున్నారని, ఇజ్జత్‌ పోతోందంటూ తల్లిదండ్రులకు చెబుతున్నారు. కొందరు మైనర్లు బైకుల కోసం తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారని, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనాలంటూ బలవంత పెడుతున్నారని ట్రాఫిక్‌ పోలీసు అధికారుల సర్వేలో తేలింది. బైకులపై లైసెన్స్‌ లేకుండా రేసుల్లో పాల్గొంటున్నారని పోలీసులు గుర్తించారు. అలాంటివారు తొలిసారి ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే.. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులనూ జైలుకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)