ఐశ్వర్య ధనుష్ విడాకులు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 17 January 2022

ఐశ్వర్య ధనుష్ విడాకులు !


కోలీవుడ్ హీరో ధనుష్ ఐశ్వర్యతో వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ధనుష్, ఐశ్వర్యల మధ్య సెపరేట్ అయ్యేంత గొడవలు ఏమున్నాయి. అసలు వీళ్లు ఎందుకు డైవర్స్ తీసుకోవాలని అనుకున్నారు లాంటి విషయాలపైన కోలీవుడ్ మీడియా రకరకాల కథనాలు రాస్తుంది. అయితే ముఖ్యంగా ధనుష్ డైవర్స్ ప్రకటించడం వెనక ఒక హీరోయిన్ ప్రమేయం ఉందని టాక్. ధనుష్ తో ఆ హీరోయిన్ జోడీ సూపర్ హిట్. వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ పెయిర్ చాలా బాగుంటుంది. ఆ హీరోయిన్ కి డైరక్టర్ తో పెళ్లైనా సరే మళ్లీ సినిమాలని వదల్లేక విడాకులు ఇచ్చేసింది. ఆమె కూడా ఇప్పుడు పూర్తి ఫోకస్ సినిమాల మీద పెట్టింది. ధనుష్ తో ఆ హీరోయిన్ ని లింక్ పెడుతూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే ధనుష్ ఇప్పుడు ఐశ్వర్యకి విడాకులు ఇవ్వడంతో మళ్లీ ఆమె వార్తల్లో నిలిచింది. ధనుష్ డైవర్స్ కు కారణం ఆ హీరోయినే అని కొందరు ఆమెని ఎటాక్ చేస్తున్నారు. ధనుష్, ఐశ్వర్యల డైవర్స్ కు అసలు కారణం ఏంటన్నది మాత్రం బయటకు రాలేదు. 18 ఏళ్లు కలిసి ఉన్నాం ఇక తమ దారులు వేరుగా చూసుకుంటున్నామని ప్రకటించి సడెన్ గా ఆడియెన్స్ కి దిమ్మ తిరిగేలా చేశారు ధనుష్. వీరి డైవర్స్ పై సూపర్ స్టార్ రజినీ కాంత్ ఫ్యాన్స్ కూడా అప్సెట్ లో ఉన్నారని తెలుస్తుంది. అయితే ధనుష్ తో అప్పుడెప్పుడో సినిమాల్లో నటిస్తే ఇప్పుడు అతని డైవర్స్ కు ఆ హీరోయిన్ కారణమని చెప్పడం మాత్రం షాకింగ్ గా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ధనుష్, ఐశ్వర్యల విడాకులకు ఒక హీరోయిన్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

No comments:

Post a Comment