ఏడాది దాటేసిన కవలలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 3 January 2022

ఏడాది దాటేసిన కవలలు !


అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సలినాస్ ప్రాంతంలో నివసిస్తున్న మాడ్రిగల్ అనే నిండు గర్భిణీ  ప్రసవం కోసం స్థానిక నాటివిడాడ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రికి వచ్చింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతున్న మాడ్రిగల్ కు వైద్యులు డెలివరీ చేశారు. ఈక్రమంలో ముందుగా మగబిడ్డకు జన్మనిచ్చిన మాడ్రిగల్, 15 నిముషాల అనంతరం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వీరిలో మగబిడ్డ 2021 డిసెంబర్ 31న 11:45కి జన్మించగా.. ఆడబిడ్డ 2022 జనవరి 1న 00:2 నిముషాలకు జన్మించింది. అత్యంత అరుదుగా జరిగిన ఈ సంఘటనపై ఆసుపత్రి వర్గాలు సంతోషం వ్యక్తం చేసాయి. మాడ్రిగల్ తమ ఆసుపత్రిలో తన ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మాడ్రిగల్ దంపతులకు గతంలో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరు చిన్నారులు రావడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిసాయి. ఈఘటన తాలూకు సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. సూపర్ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు వావ్.. స్పెషల్ ట్విన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

No comments:

Post a Comment