రాజమౌళి, హర్షవర్ధన్ కి రిలేషన్ ఏంటి !

Telugu Lo Computer
0


అమృతం  సీరియల్ ద్వారా హర్షవర్ధన్ కి విపరీతమైన క్రేజ్ లభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న హర్షవర్ధన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించగా అవి బాగా వైరల్గా మారాయి. హర్ష వర్ధన్ కి దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న సంబంధం గురించి ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు, ఆయన మాట్లాడుతూ ' నేను రాజమౌళి అప్పట్లో దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే సీరియల్ కి నేను రైటర్ గా పని చేశాను, నా రైటింగ్ స్కిల్స్ అంటే రాజమౌళి కి ఎంతో ఇష్టం, దాదాపు 15 ఎపిసోడ్స్ కి పైగా ఆయన నాతో డైలాగ్స్ రాయించడమే కాకుండా, నాకోసం ఒక్క ప్రత్యేకమైన పాత్రని కూడా అద్భుతంగా డిజైన్ చేసారు. ఆ పాత్రకి నాకు ఎంతో పేరు వచ్చింది. శాంతినివాసం సీరియల్ చేస్తున్న సమయం లోనే ఆయనకీ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. శాంతి నివాసం సీరియల్ మరియు స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఈ రెండిటికి రాఘవేంద్ర రావు గారే నిర్మాత, రాజమౌళి గారు శాంతి నివాసం సీరియల్ బాధ్యతలు నాకు అప్పగించి , ఆయన సినిమాల్లోకి వెళ్లిపోయారు' అంటూ చెప్పుకొచ్చారు హర్ష వర్ధన్. ఇక అంతే కాదు శాంతినివాసం సీరియల్ తో మా ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం మొదలైంది. ఇప్పుడు కూడా నేను అడిగితే ఆయన సినిమాలలో తప్పకుండా నాకు అవకాశం ఇస్తాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు హర్షవర్ధన్.

Post a Comment

0Comments

Post a Comment (0)