తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 10 January 2022

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం


ఆకర్షణియమైన ప్రకటనలు, కస్టమర్లను అట్రాక్ట్‌ చేసే ఆఫర్లు. ఇలా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు.. ధనార్జనే లక్ష్యంగా తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయి. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు రంగంలోగి దిగింది ఆదాయ పన్ను శాఖ. హైదరాబాద్‌,ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో.. మూడు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నవ్య డెవలపర్స్‌, స్కందాన్షి ఇన్‌ఫ్రా, రాగమయూరి సంస్థల్లో సోదాలు చేయగా. లెక్కచూపని 800 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు గుర్తించారు. కోటి 64 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు చేపట్టింది ఆదాయ పన్ను శాఖ. హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, వైజాగ్‌లలో 4 రోజుల పాటు ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. నంద్యాల, బళ్లారిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. భూముల కొనుగోలుకు నగదు చెల్లించాయి. బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్న కంపెనీలు.. లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ తయారు చేసుకున్నాయి. పెద్దమొత్తంలో అనధికారికంగా లావాదేవీలు నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థలు.. ఐటీకి చిక్కకుండా సాఫ్ట్ వేర్‌ను ధ్వంసం చేశాయి. రియల్ ఎస్టేట్‌ కంపెనీల్లో అవకతవకలకు సంబంధించి జనవరి 5 తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో చేతితో రాసిన పుస్తకాలు, అగ్రిమెంట్లను అధికారులు గుర్తించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల నుంచి డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. లెక్కలను తారుమారు చేసేలా.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నట్టు ఇన్‌కమ్ టాక్స్ అధికారులు గుర్తించారు.

No comments:

Post a Comment