కేరళ లో భార్యల మార్పిడి రాకెట్‌ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 10 January 2022

కేరళ లో భార్యల మార్పిడి రాకెట్‌ !


కొట్టాయం జిల్లా పథనాడ్‌కు చెందిన ఆ మహిళ నిస్సహాయ స్థితిలో గత శనివారం పోలీసులను ఆశ్రయించింది. తన భర్తే తనను పరాయి పురుషులతో శృంగారంలో, అసహజ లైంగిక చర్యల్లో పాల్గొనమంటున్నాడంటూ వాపోయింది. భర్త సహకారంతో తనపై తొమ్మిది మంది అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై అత్యాచారానికి పాల్పడిన తొమ్మిది మందిలో ఐదుగురు తమ భార్యలతో వచ్చారని మిగతా నలుగురూ భార్యలను తీసుకురాలేదని వెల్లడించింది. తాను చెప్పినట్టు చేయకపోయినా, ఈ విషయం ఎవరికైనా చెప్పినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని చెప్పింది. రెండేళ్లుగా ఈ నరకాన్ని భరిస్తున్నానని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె చెప్పిన వివరాల ఆధారంగా.. దర్యాప్తునకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. సైబర్‌ సెల్‌ పోలీసుల నేతృత్వంలో దర్యాప్తు కొనసాగించి.. కేరళలోని వివిధ జిల్లాల్లో ఉంటున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలి భర్తనూ అదుపులోకి తీసుకున్నారు. 

No comments:

Post a Comment