ఆవు నెయ్యి - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని గురక సమస్య బాధిస్తుంది. నిద్రించే సమయంలో గురక పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఇబ్బంది పడుతుంటారు. శ్వాస మార్గంలో అడ్డంకులు, అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కు లోపలి భాగం వాచి పోవడం, మద్యపానం, ధూమపానం, ఊబకాయం, పలు రకాల మందుల వాడకం, ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం.. ఇలా వివిధ కారణాల వల్ల గురక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాంతో ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో అర్థంగాక ఎంతగానో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు గురక పెట్టకుండా అడ్డుకోడానికి మార్కెట్ లో లభ్యమయ్యే ఉత్పత్తులపై ఆధారపడుతుంటారు. కానీ, సహజ సిద్ధంగ లభించే ఆవు నెయ్యితో గురక సమస్యకు స్వస్తి పలకవచ్చు.  ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల ఆవు నెయ్యిని తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రోగ నిరోధక శక్ పెంపొందుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. లైంగిక సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు పెరుగుతుంది. అలాగే గురక సమస్యనూ ఆవు నెయ్యి నివారిస్తుంది. అదెలాగంటే.. నిద్రించే ముందు రెండంటే రెండు చక్కల ఆవు నెయ్యిని ముక్కులో వేసుకుని తల కింద దిండు లేకుండా అర గంట పాటు ఉండాలి. ఆపై పడుకుంటే గురక సమస్యే ఉండదు. పైగా ఆవు నెయ్యిని ముక్కులో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. సైనస్ సమస్య తగ్గుతుంది. మరియు మెదడు చురుకుదనం సైతం పెరుగుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)