పోలీస్ స్టేషన్ ముందే వ్యభిచారం

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్  పడవా పోలీస్ స్టేషన్ ముందు పాఠఖ్ పేరుతో ఓ గెస్ట్ హౌస్ ఉంది. అందులో మీటింగులు, పార్టీలకు అద్దెకు ఇస్తున్నారు. లోపల మాత్రం అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ దందాపై పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ఓ పోలీస్ అధికారి మఫ్టీలో వెళ్లి తనకు అమ్మాయి కావాలని అడిగాడు. దీంతో గెస్ట్ హౌస్ మేనేజర్ ఇక్కడ అలాంటివి దొరకవని చెప్పాడు. కానీ పోలీస్ అధికారి తాను చాలా దూరం నుంచి వచ్చానని తెలపడంతో వెయ్యి నుంచి ఐదు వేల వరకు రేట్లు ఉంటాయని అమ్మాయిలను పిలిపించాడు. దీంతో ఆ పోలీస్ అధికారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అమ్మాయిలను మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓనర్ మాత్రం పరారయ్యాడు. గెస్ట్ హౌస్ పై  రైడ్ చేసి వ్యభిచారం ముఠా రట్టు చేయడంతో కండోమ్ లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారంలో వచ్చిన డబ్బును సగం అమ్మాయిలకు మిగతా సగం ఓనర్ కు చేరుతుందని  పోలీసులు తెలియజేశారు. సవాలుగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)