పశ్చిమ బెంగాల్‌లో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 3 January 2022

పశ్చిమ బెంగాల్‌లో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ


పశ్చిమ బెంగాల్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల అమలుకు సిద్ధమైంది. ఈ మేరకు నేటి నుంచి అన్ని విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో 50శాతం సిబ్బందితోనే పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నిత్యావసర సేవలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈనెల 15 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ అత్యవసర సర్వీసులనే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్‌ ఆంక్షల్లో భాగంగా లోకల్‌ రైళ్లను రాత్రి 7గంటల వరకు నడపనున్నట్లు సమాచారం. జూలతోపాటు స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్లర్లు, స్పాలు, వెల్‌నెస్‌ కేంద్రాలు, జిమ్‌లు మూతపడ్డాయి. కాగా 50శాతం సామర్ధ్యంతో సినిమా హాళ్లకు అనుమతులిచ్చారు. ఇక బార్లు, రెస్టారెంట్లను 50 శాతం సామర్ధ్యంతో రాత్రి 10 గంటల వరకు నడపనున్నట్లు సమాచారం. ముంబయి, ఢిల్లీ నుంచి వారానికి రెండు రోజులే విమానాలు నడుస్తాయని, బ్రిటన్‌ నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. ముప్పులేని దేశాల నుంచి వచ్చే వారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలను తప్పనిసరి చేశారు. ఈనెల 22న 4 నగరాల్లో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

No comments:

Post a Comment