ఐపీపీబీలో పది వేలకుపైగా డిపాజిట్ చేస్తే అదనపు రుసుము!

Telugu Lo Computer
0


దేశంలోని పలు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు 2022, జనవరి 1 నుంచి సేవా రుసుముల్లో భారీ మార్పులు చేశాయి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) కూడా అలాంటి మార్పులే చేసి ఈ నెల 1 నుంచి అమలు చేసింది. కాబట్టి ఇప్పుడు ఐపీపీబీలో పరిమితికి మించి ఎలాంటి లావాదేవీలు జరుపాలన్నా అధిక చార్జీలు చెల్లించాల్సిందే. క్యాష్ డిపాజిట్స్‌, క్యాష్ విత్‌డ్రాయల్స్ ఇలా సేవ ఏదైనా చేతి చమురు వదలాల్సిందే. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో బేసిక్ సేవింగ్ ఖాతా కలిగిన వాళ్లు ఎంత మొత్తమైనా ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు. అదేవిధంగా క్యాష్ విత్‌డ్రాయల్స్‌లో నెలకు నాలుగు లావాదేవీలు ఉచితం. ఆపై ప్రతి లావాదేవీకి లావాదేవి విలువలో 0.50 శాతానికి లోబడి కనీసం రూ.25 చార్జిచేస్తారు. సేవింగ్ ఖాతాదారులు (బేసిక్ సేవింగ్ ఖాతా కాకుండా) నెలలో రూ.25 వేలు ఎలాంటి చార్జీలు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆపై ప్రతి లావాదేవీకి దాని విలువలో 0.50 శాతానికి లోబడి కనీసం రూ.25 చార్జి చేస్తారు. కరెంట్ బ్యాంకు ఖాతాదారులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. బేసిక్ సేవింగ్ ఖాతాదారులు తమ ఖాతాల్లో ఎంతయినా ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. సేవింగ్ ఖాతాదారులు మాత్రం రూ.10 వేల వరకు మాత్రమే ఉచితంగా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. అంతకుమించి డిపాజిట్ చేస్తే దాని విలువలో 0.50 శాతానికి లోబడి రూ.25 మొత్తం లావాదేవీ చార్జి వసూలు చేస్తారు.


Post a Comment

0Comments

Post a Comment (0)