ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 2 January 2022

ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కురుపాంలో రాంబాబు అనే వ్యక్తి పోలీస్‌నంటూ బెదిరించి ఇద్దరు గిరిజన బాలికలపై వేర్వేరుగా అత్యాచారం చేశాడు. ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌ విహారయాత్ర ముగించుకుని తిరిగి వెళ్తుండగా బాలికలను బెదిరించి రాంబాబు లొంగదీసుకున్నాడు. అనంతరం వారిపై అత్యాచారం చేశాడు. రాంబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాంబాబుపై గతంలోనూ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జనవరి 1న మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ఇద్దరు విద్యార్థులు మొత్తం నలుగురు ఒట్టిగెడ్డ రిజర్వాయర్ కు విహార యాత్రకు వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో నడుచుకుంటూ వస్తుండగా రాంబాబు అనే వ్యక్తి వారిని అటకాయించి తోటలోకి తీసుకెళ్లి బెదిరించాడు. ఇద్దరు విద్యార్ధులను అక్కడే కూర్చొబెట్టాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థినులను సమీపంలోని ఫామ్ ఆయిల్ తోటలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ రాత్రి జూనియర్ కాలేజీకి చేరుకున్న విద్యార్థులు జరిగిన ఘటనను కాలేజీ సిబ్బందికి చెప్పారు. కాలేజీ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగం ప్రవేశం చేసిన పోలీసులు పూర్తి వివరాలను సేకరించిన తర్వాత నిందితుడు రాంబాబును అదే రాత్రే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాంబాబు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్లుగా సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

No comments:

Post a Comment