సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం ఇష్టం లేదు!

Telugu Lo Computer
0


మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ రోజు ఉదయం సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సినీ కార్మికుల తరుపున ఓ వ్యక్తి పైకి లేచి మాట్లాడుతూ ''ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఆ బాధ్యత చిరంజీవి గారు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం' అంటూ చిరంజీవి వైపు చూశారు. వెంటనే చిరంజీవి మాట్లాడుతూ 'ఈ పెద్దరికం, ఈ హోదాలు నాకు ఇష్టం లేదు. నేను మాత్రం పెద్దగా అస్సలు వ్యవహరించను. ఆ పదవి నాకస్సలు వద్దే వద్దు. అయితే, బాధ్యత గల ఒక బిడ్డగా మాత్రం మీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను. అందరి బాధ్యతా తీసుకుంటాను. అందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే అవసరం వచ్చినప్పుడు తప్పకుండా సాయం చేయడానికి ముందుకు వస్తాను' అంటూ చిరు ఉద్వేగంతో చెప్పారు.  పరోక్షంగా మోహన్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ 'నేను అనవసరమైన వాటిని పట్టించుకోను. ముఖ్యంగా కొన్ని గొడవల విషయంలో మాత్రం నేను ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే ఆ వివాదాలను, ఆ గొడవలను తీరుస్తూ నేను కూర్చోలేను. ఒకవేళ ఎవరైనా అలాంటి వాటిని నా వద్దకు తీసుకువస్తే ఎట్టిపరిస్థితుల్లో నేను పంచాయతీ చేయను' అంటూ చిరు పరోక్ష విమర్శలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)