దేశంలోనే పేరు లేని రైల్వే స్టేషన్

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లోని  బుర్ద్వాన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న  పేరు లేని రైల్వే స్టేషన్ ను 2008లో నిర్మించారు. బుర్ద్వాన్ జిల్లాలోని రాయ్‌నగర్ – రైనా గ్రామాల సమీపంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ కు మొదట్లో రాయ్‌నగర్ రైల్వే స్టేషన్ గా పేరుపెట్టారు. అయితే స్టేషన్ ఉన్న ప్రాంతం అధిక భాగం తమ గ్రామంలో ఉందని, దానికి తమ గ్రామ పేరే పెట్టాలని రైనా గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇది ఇరు గ్రామాల సమస్యగా మారిపోవడంతో రైల్వే అధికారులు ఈ స్టేషన్ కు పేరు లేకుండా చేశారు. అయితే స్టేషన్ కు తమ గ్రామం పేరే పెట్టాలని.. రైనా గ్రామస్తులు నేటికీ జిల్లా కోర్టులో పలుమార్లు అర్జీలు సమర్పించారు. అయితే జడ్జి వారి అర్జీలను కొట్టివేసి..ఆ నిర్ణయాన్ని రైల్వే అధికారులకే వదిలేశారు.  ఈ రైలు మార్గాన్ని గతంలో బంకురా-దామోదర్ రైల్వే మార్గంగా పిలిచేవారు. తరువాత, ఇది హౌరా-బర్ధమాన్ మార్గానికి అనుసంధానించబడింది. ఈ స్టేషన్‌లో బంకురా-మసగ్రామ్ ప్యాసింజర్ రైలు మాత్రమే రోజుకు ఆరు సార్లు ఆగుతుంది. స్థానిక గ్రామాల వారి సౌకర్యార్థమే కాబట్టి ఎవరికీ నచ్చిన పేరుతో వారు పిలుస్తారు. ఇక కిలోమీటర్ల లెక్కన టికెట్ ఇస్తారు. కొత్తగా ఇక్కడికి వచ్చే వారికి మాత్రం పేరు లేని ఈ రైల్వే స్టేషన్ ను చూసి కొంత ఆశ్చర్యానికి గురవుతారని స్థానికులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)