ఇంటికే వచ్చి బొలెరో పికప్​ ట్రక్కు డెలివరీ !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమాన ఘటన సుఖాంతమైంది. రైతు కెంపెగౌడ ఆర్డర్ చేసిన బొలెరో పికప్​ ట్రక్కును సిబ్బంది ఇంటికే వచ్చి అప్పగించారు. ఈ మేరకు షోరూంలో పనిచేసే సిబ్బంది, అధికారులు గౌడకు క్షమాపణలు చెప్పారు. 'షోరూం సిబ్బంది వాళ్లంతట వాళ్లే వచ్చి బొలెరో పికప్​ ట్రక్కు డెలివరీ చేశారు. 'ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదనే నేను కోరుకుంటున్నా. వాహనాన్ని సమయానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది' అని కెంపెగౌడ ఆనందం వ్యక్తం చేశారు. ఈ డెలివరీపై అంతకుముందే మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది. రైతుకు, ఆయన స్నేహితులకు జరిగిన అవమానానికి చింతిస్తున్నట్లు తెలిపింది. 'జనవరి 21న మహీంద్రా షోరూంలో రైతు కెంపెగౌడ, ఆయన స్నేహితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఇచ్చిన మాటకు కట్టుబడి తగిన చర్యలు తీసుకున్నాం. సమస్య ఇప్పుడు పరిష్కారమైంది. మా వాహనాన్ని ఎంచుకున్నందుకు కెంపెగౌడకు ధన్యవాదాలు. మహీంద్రా కుటుంబంలోకి స్వాగతం' అంటూ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఈ ట్వీట్‌పై మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. సంస్థ కుటుంబంలోకి కెంపెగౌడను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)