కరోనా వైరస్ - ఘగర్ పేషెంట్లు - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


కరోనా వైరస్ సాధారణంగా ఉన్నవారికంటే డయబెటీస్ ఉన్నవారికి కాస్త ప్రమాదకరం అని చాలామంది అంటున్నారు.  సాధారణంగా ఘగర్ వ్యాధి వచ్చిన వారిలో రక్తంలో చెక్కర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉంటాయి. మరి ఈ రక్తంలో చెక్కర స్థాయిలు ఉన్నప్పుడు ఇది రక్తాన్ని చిక్కపరుస్తుంది. రక్తం చిక్కపడ్డప్పుడు చురుగ్గా ఉండదు. రక్తప్రసరణ వ్యవస్థ మందకుడిగా జరుగుతుంది. ఎక్కువ చెక్కర ఉండటంవల్ల రక్తనాళాలు కూడా గట్టిపడుతాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. వీటితో పాటు..రక్తంలో చెక్కర స్థాయిలు ఎక్కువ ఉండేసరికి..రక్తంలో ఉండే తెల్లరక్తకణాలకు కూడా ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా రక్తంలో టీ హెల్పర్ సెల్స్ అనే కణజాలం ఉంటుంది. అవి చురుగ్గా గస్తీ కాయాలి. ఇవి వైరస్ వస్తే..గుర్తుపట్టి..మొత్తం బాడీకీ సమాచారం అందిస్తాయి. ఎప్పుడైతే.. బ్లడ్ లో ఘగర్ లెవల్స్ పెరిగిపోతాయో..ఈ సెల్స్ కూడా డౌన్ అయిపోతాయి..వైరస్ వస్తే ఇది గుర్తుపట్టలేదు. దాంతో మన శరీరంలో ఉండే రక్షకదళాలన్నీ స్లో అయిపోతాయి. ఒకవేళ రంగంలోకి దిగినా తెల్లరక్తకణాల ఉత్పత్తికానీ, అవి పనిచేసే తీరుమీద రక్తంలో చెక్కరస్థాయిలు ఎక్కువ ఉండే సరికి వాటియొక్క ఎఫెక్ట్ 40-50 తక్కువ ఉంటుంది. ఇక దీంతోపాటు మన శరీరంలో కొన్ని మాక్రోఫైస్ కణాలు, టీ కిల్లర్ సెల్స్ ఇట్లాంటివి వైరస్ క్రిములను చంపేస్తాయి. ఈ చంపే ప్రక్రియ ఘగర్ ఎక్కువుగా ఉన్నప్పుడు చాలా స్లోగా జరుగుతుంది. ఈలోపు వైరస్ ఎంటర్ అయి..వాటి సంఖ్యను పెంచేస్తుంది. అలా శరీరంలో చచ్చే ప్రక్రియ తగ్గి వైరస్ ఉద్ధృతి పెరుగుతుంది. ఇక్కడే వైరస్ విజృంభన బాగా జరుగుతుంది. ఇంకొక నష్టం మన శరీరంలో బీ కణజాలం ఉంటాయి. ఇవే యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీస్ అనేవి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు శరీరంలోకి వైరస్ వెళ్లినా..ఈ యాంటీబాడీస్ అనేవి బంధించేస్తాయి. కానీ ఈ డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవారిలో యాంటీబాడీస్ ఉత్పత్తిఅయినా…ఇవి రక్తంలో తిరుగుతుంటాయి..ఆ క్రమంలో రక్తంలోని చెక్కర యాంటీబాడీస్ కు పట్టుకుంటాయి. దాంతో ఈ యాంటీబాడీస్ వైరస్ ను బంధించలేవు. ఇవి అన్ని రకాలుగా కలిసి..ఘగర్ ఉన్నవారికి వైరస్ సోకినప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో చేరటం కూడా జరుగుతుంది. కాబట్టి డయబెటీస్ పేషెంట్స్ స్పెషల్ అటెంక్షన్ పెట్టుకోవాలి. డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. సాధారణ వ్యక్తుల్లా..ఇంటివైద్యంతో వీరికి వైరస్ నయం అయిపోతుంది అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం తీసుకున్న ఆహారం పొట్టప్రేగుల్లో అరిగిన తర్వాత అది చెక్కరగా మారుతుంది. ఆ చెక్కరను పొట్టప్రేగుల గోడలు పీల్చుకుంటాయి. చెక్కర రక్తంలో చేరుతుంది. రక్తంలోకి వెళ్లిన చెక్కర మనకు శక్తిగా మారాలంటే..కణంలోపలికి వెళ్లాలి. కణం లోపలికి చెక్కరను ఇన్సులిన్ అనే హార్మోన్ చేర్చుతుంది. ఈ ఘగర్ వచ్చేవారిలో ఇన్సులిన్ ఉంటుంది..కానీ పనిచేయదు. అందుకని రక్తంలో ఉన్న చెక్కర కణంలోపలి వెళ్లకుండా అక్కడే మిగిలిపోతుంది. అలా మిగిలిపోవడం వల్ల..బ్లడ్ లో ఘగర్ శాతం పెరిగిపోతుంది. పీచు, మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. పిండిపదార్థాలు బాగా తక్కువ ఉండాలి. ఉదయం స్ప్రౌట్స్, నానపెట్టిన వేరశనగపప్పులు తింటూ ఉండాలి. ఇవి మెల్లగా అరుగుతాయి. మధ్యాహ్నం జొన్నరొట్టలు లేదా మల్టీగ్రెయిన్ దోశలు ఎక్కువగా కూరలు తినాలి. సాయంకాలం పూట..పచ్చికొబ్బరి తురము, డ్రైఫ్టూట్స్, పండ్లు ఇలాంటి వాటితో డిన్నర్ కంప్లీట్ చేస్తుంటే..ఘగర్ నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)