పీత రక్తం లీటర్ రూ.12 లక్షలు!

Telugu Lo Computer
0


వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను ఈ పీత రక్తం (ఎల్‌ఏఎల్‌)తో పరీక్షిస్తారు. శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్‌మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్‌ పరికరాలను కూడా ఎల్‌ఏఎల్‌తో పరీక్ష చేస్తారు. 'హార్స్‌షూ' పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది. అంతేగాకుండా పీతల సేకరణ, రక్తం తీయడం వంటివన్నీ క్లిష్టమైన పనులేనని ఆ రంగంలోని వారు చెబుతున్నారు. అందుకే దీనిని నీలి బంగారం (బ్లూగోల్డ్‌) అని పిలుస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయలను ఈ పీతల రక్తం (ఎల్‌ఏఎల్‌) కోసం వెచ్చిస్తుంటాయట. ఇంత డిమాండ్ ఉన్న పీతల రక్తానికి 12 లక్షలు ధర అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

Post a Comment

0Comments

Post a Comment (0)