అసమానతలు వీడండి : అధనోమ్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 3 January 2022

అసమానతలు వీడండి : అధనోమ్

 

 దేశాలకు దేశాలు కరోనాను చూసి గజగజలాడిపోయాయి. మహమ్మారితో ప్రయాణం రెండు సంవత్సరాలు దాటి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి మహమ్మారి అంతమయ్యే అవకాశం ఉందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ వెల్లడించారు. ఈ క్రమంలో 2022 నూతన సంవత్సరం సందర్భంగా ఆయనపలు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రపంచానికి మహమ్మారి నుంచి ఈ ఏడాది విముక్తి కలగాలంటే.. ముందు మనందరిలో “అసమానతలు” తొలగిపోవాలని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో అసమానతల కారణంగా సుహృద్భావం తగ్గిపోయిందని తద్వారా, ఇటువంటి విపత్తుల సమయంలో కొందరు ప్రజలు సహాయం పొందలేకపోతున్నారని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలందరూ తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించిననాడే కరోనా వంటి విపత్తుల నుంచి మనలని మనం రక్షించుకోగలమని టెడ్రోస్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సాధారణ టీకాలు తీసుకోలేకపోయారని, ఇతర వ్యాధులకు చికిత్సనూ కోల్పోయారని టెడ్రోస్ తెలిపారు. కలిసికట్టుగా ప్రజలందరూ సహకారం అందించుకుని టీకాలు వేయించుకుంటేనే కరోనా వంటి మహమ్మారుల నుంచి రక్షణ పొందగలమని టెడ్రోస్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భవిష్యత్ లో మరింత ప్రభావవంతమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా, వాటికీ మనం సిద్ధంగా లేకపోతే మానవాళికి పెను ముప్పు వాటిల్లుతుందని టెడ్రోస్ తెలిపారు. కావున ప్రజలంతా అసమానతలు వీడి స్నేహపూర్వకంగా ఉండాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment