ఆంధ్రప్రదేశ్ లోనూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ?

Telugu Lo Computer
0


వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో చిట్ చాట్ సందర్భంగా  ఏపీలో పార్టీ పెడుతున్నారా అని విలేకరులు  అడిగిన ప్రశ్నకు రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు అని షర్మిల వ్యాఖ్యానించారు. పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా అని ప్రశ్నించారు. తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామన్నారు. ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.తెలంగాణలో రైతు ఆవేదన యాత్రకి నిబంధనల ప్రకారం పోతామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు పెడుతున్నారన్న షర్మిల.. బీజేపీ, కేసీఆర్ దొందు దొందే అని వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)